బ్రేకింగ్.. అర్ధరాత్రి వీవీప్యాట్ల గోల్‌మాల్.. కారులో తీసుకెళ్లిన వ్యక్తి (వీడియో)

by Anukaran |   ( Updated:2021-10-30 21:09:51.0  )
బ్రేకింగ్.. అర్ధరాత్రి వీవీప్యాట్ల గోల్‌మాల్.. కారులో తీసుకెళ్లిన వ్యక్తి (వీడియో)
X

దిశ ప్రతినిధి , కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా జరిగింది. అయితే పోలింగ్ అనంతరం వీవీప్యాట్‌లను తరలిస్తుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వీవీప్యాట్స్‌ను హుజురాబాద్ నుంచి కరీంనగర్‌లోని SRR కాలేజీకి తరలిస్తుండగా గోల్ మాల్ జరిగినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై సెక్యూరిటీ లేకుండా వీవీప్యాట్స్‌ను ఓ కారులోకి మార్చి తరలించినట్టు తెలిసింది.

అయితే వీవీప్యాట్స్, ఈవీఎంలను తరలిస్తున్న ఓ బస్సు టైర్ పంక్చర్ కావడంతో బస్సులన్నీ రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో వీవీప్యాట్స్, ఈవీఎంల తరిలింపులో కొంత ఆలస్యం జరిగింది. కాగా, ఈ పరిణామాలపై బీజేపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. Evmలను తరలించే వాహనాలను కావాలనే మధ్యలో నిలిపి వేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయం తెలియడంతో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్‌ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వెంకట్ పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు వీ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు.

ఇక, ఈ తతంగంపై హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దంటూ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు పనిచేయని వీవీప్యాట్స్‌ను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల రిసెప్షన్ సెంటర్ రోడ్డులో నుండి ఒక అధికారిక వాహనం నుండి మరొక అధికార వాహనంలో గోదాంకు తరలించారు. ఈ సందర్భంగా అనుమానంతో ఓ వ్యక్తి వీడియో తీసి ఈ వీడియోను వైరల్ చేశాడని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాలను, పుకార్లను నమ్మవద్దని రవీందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed