నాన్న క్షేమం.. నసీరుద్దీన్ షా తనయుడు

by Shyam |
నాన్న క్షేమం.. నసీరుద్దీన్ షా తనయుడు
X

బాలీవుడ్ ఇద్దరు దిగ్గజ నటులను కోల్పోయింది. లెజెండరీ యాక్టర్ లను కనీసం కడ సారి చూపునకు నోచుకోలేక పోయామనే బాధలో కుంగిపోతున్నారు నటులు. ఇంతలోనే విలక్షణ నటుడు నసీరుద్దిన్ షా పరిస్థితి విషమంగా ఉందని, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే నసీరుద్దీన్ షా అనారోగ్యంగా ఉన్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు ఆయన కొడుకు వివాన్ షా.

నాన్న బాగున్నారు. ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆ ఇద్దరినీ చాలా మిస్ అవుతున్నాము. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వివాన్.. ఇది బాలీవుడ్ ఇండస్ట్రీకి కోలుకోలేని గాయమని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags: Bollywood, Naseeruddin Shah, Vivaan Shah, Irfan Khan, Rishi Kapoor

Next Story

Most Viewed