ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. భయం లేదన్న విరాట్ కోహ్లీ

by Shyam |   ( Updated:2021-10-21 06:56:53.0  )
Captain Virat Kohli
X

దిశ, వెబ్‌డెస్క్: టీ-20 వరల్డ్‌ కప్‌లో భాగంగా పాక్‌తో జరిగే ఆరంభమ్యాచ్‌కి తాను ఏ మాత్రం భయపడనని టీమిండియా కెప్టెన్ కింగ్ కోహ్లీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నాడు. “ప్రజలారా ఆదివారం బిగ్ మ్యాచ్.. మీరు భయపడుతున్నారు, అవునా?” అంటూ ట్వీట్ చేసాడు. నేను ఇతర మ్యాచ్‌ల మాదిరిగానే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ని కూడా పరిగణిస్తానని కోహ్లీ తెలిపాడు. గతంలో కూడా భారత్, పాక్ మ్యాచ్‌పైన ఇలాగే స్పందించాడు.

ఈ ఆదివారం అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ పోరులో అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని విరాట్ స్పష్టం చేసాడు. భారత్, పాక్ మ్యాచ్ అంటే చాలు అటు క్రికెట్ దిగ్గజాలు, విశ్లేషకులు, పండితులు మ్యాచ్ గురించి, మ్యాచ్‌పై ఉండే ఒత్తిడిని అంచనా వేయడం సహజమే అని కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed