- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అగ్రశ్రేణి అథ్లెట్లలో కోహ్లి ఒకడు: వకార్ యూనిస్
దిశ, స్పోర్ట్స్: అగ్రశ్రేణి అథ్లెట్లలో విరాట్ కోహ్లి ఒకడని, క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు అతడు ఒక స్టాండర్డ్ సృష్టించాడని పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ అన్నారు. ప్రపంచ క్రికెటర్లలో ఫిట్‌నెస్ విషయంలో కోహ్లికి ప్రత్యేక స్థానం ఉంది. అతడిని చూసే టీమ్‌ఇండియాలో చాలా మంది ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టారనే విషయం అందరికీ తెలిసిందే. టీమ్‌ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ నుంచి మాజీ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ వరకు అందరూ ఫిట్‌నెస్‌పై భారత కెప్టెన్‌ను ప్రశంసించిన వారే. ఇదే విషయాన్ని వకార్ యూనిస్ ఒక ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో మాట్లాడారు. ‘కోహ్లి క్రికెట్‌ను ఎంతో అభివృద్ధి చేశాడు. అతడు టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. క్రికెట్‌లో అతడు తీసుకొచ్చిన అతిపెద్ద వ్యత్యాసం ఫిట్‌నెస్. అతడు ఫిట్‌నెస్‌కు ఒక స్టాండర్డ్ తీసుకొచ్చాడు. ఆ విషయంలో కోహ్లి అందరికీ నచ్చుతాడు. ఎప్పుడూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి తాపత్రాయపడుతుంటాడు. అతడు ఒక పోరాట యోధుడు. అందుకే కోహ్లి అంటే అందరికీ ఇష్టం. అయితే, పాక్ క్రికెటర్లు కూడా ఫిట్‌నెస్ విషయంలో కోహ్లి ఏ మాత్రం తీసిపోరు. బాబర్, షాహీన్షాలు కూడా చాలా ఫిట్‌గా ఉంటారు’ అని వకార్ అన్నాడు. ప్రస్తుతం వకార్ యూనిస్ పాకిస్తాన్ జట్టుతో ఇంగ్లండ్‌లో ఉన్నాడు. మాంచెస్టర్‌లో ఆగస్టు 5 నుంచి పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానున్నది.