- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రస్తుత జట్టే అత్యుత్తమం: గైక్వాడ్
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం ఉన్నదే అత్యుత్తమ జట్టని, అన్ని విషయాల్లో కోహ్లి బృందం సమతూకంగా ఉందని మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ అభిప్రాయపడ్డారు. టీమ్ఇండియాకు గతంలో కోచ్‌గా పనిచేసిన గైక్వాడ్ తాజాగా స్పోర్ట్స్ కీడా వెబ్‌సైట్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ప్రస్తుత జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉంది. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో బలంగా ఉంది. గతంలో బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లు ఎవరో ఒకరే బలంగా ఉండేవాళ్లు. కానీ, ఇప్పుడు జట్టు సమతూకంతో ఉంది. ఎవరో ఒకరు మ్యాచ్‌ను గెలిపించగలిగే సత్తా కలిగి ఉన్నారు’ అని గైక్వాడ్ అన్నారు. కాగా, 2014 నుంచి టెస్ట్ జట్టుకు, 2017 నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కోహ్లి వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా భారత జట్టు నిలకడగా రాణిస్తున్నది. కోహ్లి హయాంలో ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా గెలవకపోవడం పెద్ద లోటుగా ఉంది.