- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాదీ మహిళా క్రికెటర్‌కు కోహ్లీ సాయం
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కష్టాల్లో ఉన్న క్రికెటర్‌కు ఆర్థికంగా అండగా నిలబడి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లిదండ్రులకు కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే దాదాపు రూ. 16 లక్షలు ఖర్చు చేయడంతో ఆర్థిక పరిస్థితి దిగజారి పోయింది. దీంతో ఆమె బీసీసీఐ, హెచ్‌సీఏ సహాయాన్ని కోరింది. ఆమె పరిస్థితిని తెలియజేస్తూ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల కూడా ట్వీట్ చేసింది. దీంతో హెచ్‌సీఏ కొంత మొత్తం అందించింది. క్రికెటర్ హనుమ విహారి కూడా తనకు చాతనైన సహాయం చేశాడు.
అయినా ఆర్థిక అవసరాలు తీరకపోవడంతో విషయాన్ని బీసీసీఐ సౌత్ జోన్ మాజీ కన్వీనర్, స్రవంతి సోదరి ఎన్. విద్య ట్వీట్ ద్వారా కోహ్లీని అభ్యర్థించింది. దీనికి వెంటనే స్పందించిన కెప్టెన్ కోహ్లీ రూ. 6.77 లక్షలు ఆమెకు విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్ విద్య స్పందించారు. ‘కోహ్లీ అంత త్వరగా స్పందిస్తాడని అనుకోలేదు. నిజాయితీగా అతడు సత్వరమే స్పందించడం అద్భుతంగా అనిపించింది. అతడొక మంచి క్రికెట్ మాత్రమే కాదు. ఎంతో గొప్ప ఔదార్యం కలిగిన వ్యక్తి. ఈ విషయాన్ని కోహ్లీకి చెప్పిన ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీదర్‌కు కూడా ధన్యవాదాలు’ అని చెప్పింది.