టీమ్ ఇండియా మ్యాచ్ ఫీజులో 20శాతం కోత

by Shyam |
టీమ్ ఇండియా మ్యాచ్ ఫీజులో 20శాతం కోత
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన టీమ్ ఇండియాకు రిఫరీ డేవిడ్ బూన్ మరో షాక్ ఇచ్చాడు. నిర్ణీత సమయంలోగా భారత జట్టు తమ ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు గాను ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టిక్ 2.22 ప్రకారం ఏ టీమ్ అయినా నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయకపోతే ఓవర్‌కు 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తారు. అయితే సిడ్నీలో వన్డేలో నిర్ణీత సమయంలోగా 49 ఓవర్లు మాత్రమే వేయడంతో మిగిలిన ఓవర్‌కు 20 శాతం జరిమానా విధించారు.

కెప్టెన్ కోహ్లీ తన తప్పును రిఫరీ డేవిడ్ బూన్ ముందు ఒప్పకోవడంతో దీనిపై ఎలాంటి దర్యాప్తు ఉండదని ఐసీసీ ప్రకటించింది. కాగా, కొత్తగా ప్రవేశపెట్టిన ఐసీసీ ప్రపంచ కప్ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం.. స్లో ఓవర్ రేటు కారణంగా బౌలింగ్ చేసిన జట్టు ఒక చాంపియన్‌షిప్ పాయింట్‌ను కోల్పోతుంది. ఈ మేరకు టీమ్ ఇండియాకు ఒక పాయింట్ కోత పడింది.

Advertisement

Next Story

Most Viewed