- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వీడియోలు చూసి ఎలా చేశానో తెలుసుకో అన్నారు
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్-2020లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ కావడంలో కీలక పాత్ర బ్యాటర్ ఇషాన్ కిషన్‌దే. కానీ, ఏడాది తిరిగే సరికి ఫామ్ కోల్పోయి విమర్శల పాలయ్యాడు. ఈ సీజన్లో వరుసగా విఫలమవుతున్న వేళ టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన భరోసాతో ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. గత రెండు మ్యాచ్‌లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ ముందు కిషన్ ఫామ్‌లోకి రావడం టీమ్ ఇండియా శిబిరంలో ఆనందాన్ని కలిగించింది. అయితే తనకు కోహ్లీ ఇచ్చిన భరోసాతోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చానని కిషన్ చెప్పాడు. ‘నేను విరాట్ కోహ్లీతో మాట్లాడాను. నువ్వు మెగా టోర్నీలో ఓపెనర్‌గా ఎంపికయ్యావు. అందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏ సవాలు అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని అన్నాడు. ఇక నేను ఫామ్‌లేమితో ఉన్నప్పుడు బుమ్రా, పాండ్యాతో పాటు కిరాన్ పొలార్డ్ కూడా సహాయం చేశారు. నా పాత వీడియోలు చూసి అప్పట్లో ఎలా బ్యాటింగ్ చేశానో గమనించమన్నారు. అలా తిరిగి నా ఆటను గాడిలో పడేలా చేసుకున్నాను’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.