2020లో ట్రెండ్ అయిన డర్టీ వెడ్డింగ్ ఫొటో షూట్

by Anukaran |   ( Updated:2020-12-30 02:08:48.0  )
2020లో ట్రెండ్ అయిన డర్టీ వెడ్డింగ్  ఫొటో షూట్
X

దిశ,వెబ్ డెస్క్ : మామూలుగా బీపీలు, షుగర్లు, ఇరిటేషన్లు, ప్రస్టేషన్లు ఇవ్వన్ని పెళ్లి తరువాతే వస్తుంటాయి. కానీ పిచ్చి మాత్రం పెళ్లికి ముందే వస్తుంది. అది కూడా మాములుగా కాదు పీక్స్ లో ఉంటుంది. కాకపోతే ఆ పిచ్చికి ప్రీ వెడ్డింగ్ షూట్ అని పేరుపెడుతున్నారు. మరి ఆ పిచ్చితో కూడిన ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ల వల్ల వచ్చిన అవుట్ పుట్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అవుతున్నాయి.

అందమైన లోకేషన్లలో క్రియేటివిటీ పేరుతో దిగుతున్న ఫోటోల్లో రొమాన్స్ శృతిమించుతోంది. హద్దులు దాటిన ఫొటోల్ని పర్సనల్ గా ఉంచుకుంటే సరిపోయేది. అలా కాకుండా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు నాలుగు గోడల మధ్య చేయాల్సిన పని బహిరంగంగా ఎలా చేస్తారని ట్రోల్ చేస్తున్నారు.

అయితే 2020 లో ఫొటోషూట్ల పేరుతో ఇలాంటి దారుణాలు చాలానే జరిగాయి. ఓ వైపు కరోనా లాక్ డౌన్. మరోవైపు పెళ్లిని ఎంజాయ్ చేయలేకపోతున్నామనే బాధతో.., ప్రీ వెడ్డింగ్ షూట్ల పేరుతో ఎంజాయ్ చేస్తూ ఆ బాధనుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. వాటిలో 2020లో ట్రెండ్ అయిన డర్టీ వెడ్డింగ్ ఫొటో షూట్ల గురించి తెలుసుకుందాం.

రిషి కార్తికేయన్‌, లక్ష్మి. నెటిజన్లకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటారా..?.పెళ్లి సాంప్రదాయ బద్దంగా జరిగినా.., పెళ్లి తరువాత నవదంపతులు చేసిన ఫొటో షూట్ వెస్ట్రన్ కల్చర్‌ను కేరళకు పరిచయం చేసింది. ఇక అసలు విషయానికొస్తే కేరళకు చెందిన నవ దంపతులు రిషికార్తికేయన్, లక్ష్మీలు కరోనా నిబంధనల నడుమ, పెద్దగా హడావుడి లేకుండా సెప్టెంబరు 16న పెళ్లి సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి సింపుల్‌గా జరిగింది కానీ పోస్ట్‌- వెడ్డింగ్‌షూట్‌ అయినా కాస్త వెరైటీగా ప్లాన్‌ చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా కార్తికేయన్ స్నేహితుడు, ఫోటోగ్రాఫర్ అఖిల్ కార్తికేయన్ సాయంతో కేరళలోని ఇడుక్కి జిల్లాలోని వాగామోన్ లోని టీ తోటల్లో ఫోటో షూట్ నిర్వహించారు. తెల్లని దుస్తుల్లో రిషి, లక్ష్మీలు ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి దారుణంగా ట్రోల్ అయ్యాయి. ఫొటోషూట్లో ధరించిన వైట్ అండ్ వైట్ క్యాస్టూమ్స్ బాగున్నాయి. బ్యాక్ రౌండ్ నేచురల్ గా ఉంది. కానీ చెత్తగా ఉన్న ఫర్లేదు గాని కొత్తగా ఉండాలంటూ దిగిన ఫొటోలపై నెటిజన్లు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుగోడల మధ్య చేయాల్సింది బహిరంగంగా ఎందుకు చేశారని తిట్టిపోశారు. ఫొటోల్ని డిలీట్ చేయాలని హెచ్చరించారు. ఆ హెచ్చరికల్ని పట్టించుకోని నవ దంపతులు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేం ఆ ఫొటోల్ని డిలీట్ చేయమని కరాఖండీగా చెప్పేశారు. మెడ, కాళ్లను చూపించడం నగ్నత్వం అనడం సమంజసం కాదు. ట్రోల్ చేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. వాళ్లు నేను మేకప్‌లో లేని నా పాత ఫొటోలు తీసుకుని, వీటితో పోల్చడం మొదలెట్టారు. ఈ ఫొటోల్లో తను ఎంత అసహ్యంగా ఉందో చూడండని కామెంట్లు పెట్టార”ని చెప్పారు. నెటిజన్ల ట్రోల్స్ పై తాము స్పందించాల్సిన అవసరం లేదంటూ వధూవరులు రిషి, లక్ష్మిలు విమర్శకుల నోళ్లు మూయించారు.

కేరళకు చెందిన జోస్ – అనిషా నవదంపతులు. పెళ్లికి ముందు పంటపొలాల్లో ప్రీ వెడ్డింగ్ లో పాల్గొన్నారు. పంటపొలాల నారుమడల్లోని బురదలో పొర్లాడుతూ దిగిన ఫోటోల్ని నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కొత్తగా ఉన్నాయని, ఫొటోగ్రఫీ బాగుందని కొందరు కామెంట్ చేస్తుంటే.., మరికొందరు మాత్రం 2001లో రొమాన్స్, డ్రామా జానర్ లో డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన నాయక్ సినిమా సీన్లను గుర్తు చేసుకుంటున్నారు. నాయక్ సినిమాలో విలన్ల నుంచి తప్పించుకునేందుకు అనిల్ కపూర్ బురదలో దాక్కునే సన్నివేశాలు తలపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు బురదలో పొర్లాడుతూ ముద్దులు పెట్టుకొని గుద్దులు గుద్దుకునే దాకా పోకుండా చూసుకోండి తల్లి. ఏడ పాప అడ్రస్ అంటే ఎర్రగడ్డ ఎనకాలనేటట్టున్నారంటూ మరికొందరు చమత్కరిస్తున్నారు.

ఇక 2020 ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన జంటల్లో ఈ జంటకూడా ఉంది. వీళ్లు ఫొటోషూట్ల పేరుతో అసభ్యంగా ప్రవర్తించలేదు కానీ ఎంటరటైన్మెంట్ కాస్త శృతిమించింది. దంపతులు చూడముచ్చటగా ఉన్నా. వీళ్లు చేసిన ఓవర్ యాక్షనే మీమర్స్ చేతికి మంచి కంటెంట్ దొరికినట్లైంది. అందమైన లొకేషన్లలో ఫొటోషూట్లలో పాల్గొన్న వరుడు దోతీ షర్ట్ లో , వధువు శారీలో అందంగా ఉన్నారు. కానీ ఫొటోషూట్లో మసాలా యాడ్ చేయాలని కెమెరామెన్ ఐడియా ఇచ్చాడేమో…కొద్ది దూరంలో వరుడు నిల్చొని ఉంటే అతని వెనక నుంచి వచ్చిన వధువు దోతీ లాగి అక్కడ నుంచి పరిగెత్తడం ఫన్నీగా ఉంది. ఈ ఫన్నీ ఫోటోలపై ఇది ఫొటోగ్రఫీనా అని కామెంట్ చేస్తుంటే మరికొందరు హే ఇది చాలా బాగుంది మేమూ ట్రై చేస్తామంటూ ఎమోజీలు పెడుతూ సిగ్గుపడిపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed