- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంత్యక్రియల్ని అడ్డుకున్న గ్రామస్తులు
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి మానవ జీవన విధానంలో పలు మార్పులను తీసుకురావడంతో పాటు, మనిషుల్లో మానవత్వం మంటగలిసేలా చేసింది. తాజా పరిస్థితులు దానికి అద్దం పడుతున్నాయి. ఒక వ్యక్తికి కరోనా సోకిందని తెలియగానే… ఆ వ్యక్తిని అంటరానివారిగా చూస్తున్నారు. ఇక చనిపోయిన వారి పరిస్థితి మరీ దారుణం. శ్మశానవాటికలలో అంత్యక్రియలకు కూడా అనుమతించడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా మడకశిరలో ఇలాంటి దారుణమే మరొకటి చోటుచేసుకుంది. గ్రామ సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తున్న నాగలక్ష్మి నిన్న తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
మడకశిరలోని కంటైన్మెంట్ జోన్లలో నాగలక్ష్మి విధులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో, కరోనా వల్లే ఆమె చనిపోయిందనే ప్రచారం జరిగింది. నిన్న రాత్రి ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలిస్తుండగా స్థానిక శివాపురం కాలనీవాసులు అడ్డుకున్నారు. ఇక్కడ అంత్యక్రియలు చేయొద్దని అడ్డుపడ్డారు. దీంతో, వారితో మృతురాలి బంధువులు గొడవకు దిగారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కాలనీ వాసులకు నచ్చచెప్పారు. దీంతో, ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయ్యాయి.