ముదిరిన మంచు ఫ్యామిలీ పంచాయతీ.. మరోసారి మనోజ్ సంచలన వ్యాఖ్యలు

by Mahesh |
ముదిరిన మంచు ఫ్యామిలీ పంచాయతీ.. మరోసారి మనోజ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ గా మంచి పేరు ఉన్న మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) కుటుంబం.. ఈ మధ్య తీవ్ర వివాదంగా మారింది. 2024 డిసెంబర్ నెలలో మంచు ఫ్యామిలీలో వివాదం నెలకొనగా పోలీసులు, కోర్టు జోక్యం తో కాస్త సర్దు మరణిగింది. మద్య మద్యలో చిన్న చిన్న ఇష్యూలు జరిగినప్పటికీ పెద్దగా వివాదం జరగలేదు. కానీ మరోసారి మంచు మనోజ్ (Manchu Manoj) తమ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లడంతో.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. ముందస్తు భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మనోజ్ జల్‌పల్లీలోని ఫామ్ హౌజ్ ముందు కూర్చోని నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచు విష్ణు పై కీలక ఆరోపణలు చేశాడు.

తాను ఏ రోజూ ఆస్తి కోసం కొట్లాడలేదని తన తల్లి మీద ప్రమాణం చేశాడు. విష్ణు (Vishnu)కి తానంటే కుల్లు అని, కోర్టు ఆర్డర్‌ (Court order) ఉన్నప్పటికి తనను ఇంటి లోపలికి వెళ్లనివ్వడం లేదని ఈ సందర్భంగా మనోజ్ చెప్పుకొచ్చాడు. అలాగే జల్ పల్లీ నివాసంలో తనవి 3 పెట్స్‌ ఉన్నాయని, వాటిని తనకు ఇవ్వమని అడుగుతున్నానని, తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. నా కూతురు బర్త్‌ డే చేసుకోవడానికి ఏప్రిల్‌ 2న ఇక్కడకు వచ్చానని, ఇక్కడ పరిస్థితులు బాగోలేక పోవడంతో జైపూర్‌ వెళ్లామని అన్నారు. తాను విష్ణు భవిష్యత్‌ కోసం ఆడవేషం కూడా వేశానని గుర్తు చేశారు. అలాగే తాజా పరిస్థితులపై తాను ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చార్జిషీట్‌ దాఖలు చేయట్లేదని ఈ సందర్భంగా మంచు మనోజ్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు.



Next Story

Most Viewed