- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
X
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసులు వెయ్యి దాటిన నేపథ్యంలో ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ లాక్‌డౌన్ కాలంలో కేవలం మెడికల్ షాప్స్‌కు మాత్రమే అనుమతిస్తారు. లాక్‌డౌన్ సమయంలో విజయవాడ వాసులెవ్వరూ వారంరోజుల పాటు బయట తిరగరాదని ఆయన సూచించారు. లాక్‌డౌన్ సమయానికి అవసరమైన నిత్యావసర వస్తువులు రేపు, ఎల్లుండి కొనుగోలు చేసుకోవాలని ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ విధిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా ఈ వారం రోజులు పాటు లాక్‌డౌన్‌ని పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Next Story