‘ఆఖరి సమావేశం అనుకునే.. లోకేష్ ఆ పని చేశాడేమో’

by srinivas |
‘ఆఖరి సమావేశం అనుకునే.. లోకేష్ ఆ పని చేశాడేమో’
X

దిశ ఏపీ బ్యూరో: శాసనసభలో ఎప్పటికీ అడుగుపెట్టలేవని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ చేశారు. నిన్న శాసన మండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ.. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన లోకేశ్‌కు క్రమశిక్షణ, సభ విలువలు తెలుస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆఖరి సమావేశం అనుకున్నాడేమో మంత్రులపైకి ఎమ్మెల్సీలను ఉసిగొల్పి వీడియోలు తీసి ఎల్లోమీడియాకు పంపించాడని విమర్శించారు.

Advertisement

Next Story