- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘బిచ్చగాడు 2’ ఫస్ట్ లుక్

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయింది. తల్లి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమా.. విజయ్‌కు తెలుగులో మంచి గుర్తింపునిచ్చింది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన విజయ్.. అప్పటి నుంచి తన హిట్ సినిమాలను తెలుగులోనూ డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
#pichaikkaran2 #Bitchagadu2 pic.twitter.com/hsaEdEURMO
— vijayantony (@vijayantony) July 24, 2020
బిచ్చగాడు సక్సెస్‌తో స్టార్ రేంజ్ పొందిన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో విజయ్ ఆంటోనీ.. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. కాగా,ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. విజయ్ ఆంటోనీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోంది. విజయ్‌కు బర్త్‌డే విషెస్‌తో పాటు ఆల్ ది బెస్ట్ చెప్తున్న ఫ్యాన్స్.. మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో పడినట్లే అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.