- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త అప్‌డేట్… మారిన యూట్యూబ్ వీక్షణల లెక్క
దిశ, వెబ్‌డెస్క్:
ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఎన్ని వీక్షణలు అని అడిగితే పది మిలియన్లు, ఇరవై మిలియన్లు అంటూ లెక్కలు చెప్పేవారు. అయితే ఇటీవలి అప్‌డేట్‌లో ఈ లెక్క మారింది. ప్రత్యేకంగా భారత వినియోగదారుల కోసం వీక్షణలు, సబ్‌స్క్రైబర్ల లెక్కను ఇక నుంచి లక్షలు, కోట్లలో చూపిస్తోంది. ప్రస్తుతానికి యూట్యూబ్ ఆండ్రాయిడ్ యాప్‌లో కొంతమందికి మాత్రమే ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది.
అయితే ఈ కొత్త మార్పు యూట్యూబ్ క్రియేటర్లకు, ఎంటర్‌టైన్‌మైంట్ సంస్థలకు నచ్చట్లేదు. ఇప్పటి వరకు మిలియన్లు, బిలియన్లలో లెక్కలు చేసి, తమ పనితీరును విశ్లేషించుకోగా, ఇక నుంచి లక్షలు, కోట్లను ముందు బిలియన్లు, మిలియన్లకు మార్చుకోలేక ఇబ్బందులు పడాల్సివస్తుందని అంటున్నారు. నేరుగా ఇలా చూపించడం కంటే వినియోగదారులు తమకు కావాల్సిన విధంగా మార్చుకునే సదుపాయం కల్పించాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు. చప్పా పెట్టకుండా తీసుకొచ్చిన ఈ అప్‌డేట్ చాలా ప్రభావాన్ని చూపిస్తుండటంతో ఈ విషయమై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Tags: youtube, views, count, million, rupees, lakhs, crores, unsatisfied, new update