- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నకోడూరు ఎస్ఐపై డీజీపీకి ఫిర్యాదు
దిశ,సిద్దిపేట: అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా.. ఫిర్యాదు చేసిన తమను చిన్న కోడూరు ఎస్ఐ, సీఐలు బెదిరిస్తున్నారని, తమ వివరాలను మాఫియాకు ఇచ్చి తమపై దాడులు చేసేలాగా మాఫియాను పోలీసులు ప్రేరేపిస్తున్నారని డీజీపీ,ఐజీ,సీపీలకు కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. మండల పరిధిలో కొందరు ముఠాగా ఏర్పడి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనీ, వారి నుండి ఎస్ఐ, సీఐలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు అన్నారు.
ఈ అక్రమ రవాణాపై ఎస్.ఐ, సీఐలకు ఎవరైనా పిర్యాదు చేస్తే.. మాఫియాను పట్టుకుని పోలీసులు కేసులు నమోదు చేయాల్సింది పోయి, ఫిర్యాదు దారుల వివరాలను మాఫియాకు ఇచ్చి దాడులు చేయిస్తున్నారని తెలిపారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయక పోగా ఫిర్యాదులను వాపస్ తీసుకోవాలని ఫిర్యాదు దారులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. కొన్ని సార్లు కేసులు నమోదు చేసినప్పటికీ లంచాలు తీసుకొని స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని చెప్పారు.
ఇసుక మాఫియాతో సీఐ, ఎస్ఐలతో తమకు ప్రాణ భయం ఉందని బాధితులు మీసం మహేందర్, పిండి కొమురయ్య, పిల్లి బాబు, ఉడుత జయంత్ తెలిపారు. లంచాలకు అలవాటు పడి అమాయక యువకులపైనా దాడులకు ప్రేరేపిస్తున్న ఎస్ఐ, సీఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. మామూళ్లకు అలవాటు పడి అమాయక ప్రజలను ఎస్ఐ, సీఐలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు చెప్పారు. వారిపై చెర్యలు తీసుకొని అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని బాధితులు కోరారు.