- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయసాయి వర్సెస్ నాగబాబు వయా పవన్ కల్యాణ్

X
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. జనసేన, వైఎస్సార్సీపీ మధ్య ట్విట్టర్ వార్ ఆసక్తి రేపుతోంది. కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న ప్రస్తుత సమయంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొనడంపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అసలు నీకు గ్రౌండు ఉంటే కదా రాజకీయాలు చేయడానికి అని ఎద్దేవా చేశారు. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందిస్తూ… “విజయసాయిరెడ్డీ నువ్వు చెప్పింది నిజమే. ఎదవ రాజకీయాలు చేయడానికి నీలాంటి గుంటనక్కలు ఉన్న సంగతి మాకు తెలుసు. మన ఇద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీకి రెడీ అన్న మీ గుంట నక్క రాజకీయాలు నాకు గుర్తున్నాయి” అంటూ ట్వీట్ చేశారు.
Tags: ysrcp, janasena, twitter war, vijayasaireddy, Pawan Kalyan, nagababu
Next Story