మనిషికైనా.. మనీకైనా.. గౌరవం దక్కాలంటే ఓ వ్యాల్యూ ఉండాల్సిందే..

by Shyam |   ( Updated:2021-11-16 05:04:33.0  )
artist
X

దిశ, ఫీచర్స్: కరెన్సీ నోటు తళతళలాడుతున్నా.. తడిసిపోయినా.. చివరకు చినిగిపోయినా.. దాని విలువ కోల్పోదు. కానీ ఒక్కసారి ‘పెద్ద నోట్ల రద్దు’ సమయంలో జరిగిన కొన్ని ఉదంతాలను గుర్తుకుతెచ్చుకోండి. లెక్కల్లో లేని కొన్ని కోట్ల రూపాయలు చెత్తకుండీల్లో లభ్యం కాగా మరెన్నో కరెన్సీ కట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. వెనిజులాలో కూడా ఇలానే జరిగింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయాల్లో దేశాలు ఒక్కోసారి కరెన్సీ విలువలో మార్పులు చేస్తుంటాయి. చాలాసార్లు అవి స్వల్పస్థాయిలోనే ఉంటాయి. అయితే వెనిజులా మాత్రం 2017లో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రూ.10లక్షల విలువైన బొలివర్ కరెన్సీ నోటును ఒక్క రూపాయికి తగ్గించింది.

ఇదే కాదు వెనిజులా 2008 నుంచి ఇప్పటివరకు మూడు సార్లు ద్రవ్య సవరణలు చేసింది. దీంతో చాలా నోట్లు వేస్ట్ పేపర్‌గా మిగిలిపోయాయి. అయితే మనిషికైనా, మనీకైనా గౌరవం దక్కాలంటే ఓ వ్యాల్యూ ఉండాల్సిందే. అది లేకపోతే ‘చెత్త’పాలే అన్నది జగమెరిగిన సత్యం. అందుకే వైద్య విద్యార్థిని డి గ్రెగోరియో కరెన్సీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు చెత్తలో విసిరిన బొలివర్ నోట్లపై పెయింట్ చేయాలని నిర్ణయించుంది. వాటిని తన చిత్రాలకు కాన్వాస్‌గా ఉపయోగిస్తుంది.

డి గ్రెగోరియో, ఆర్టిస్ట్

నమ్మశక్యం కాని మొత్తంలో కరెన్సీ నోట్లన్నీ చెత్తబుట్టలో విసిరేయడం కళ్లారా చూశాను. ఆ దృశ్యాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. దీంతో వాటిని వేరే ప్రయోజనం కోసం తిరిగి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం వాటిపై పెయింట్ చేయడం ప్రారంభించాను. 2017 నుంచి వందలాది నోట్లపై రకరకాల నేపథ్యాలతో బొమ్మలేశాను. పునరుజ్జీవనోద్యమ కళాకారుడు రాఫెల్ చేతిలో ప్రాణం పోసుకున్న లా ఫోర్నారినాకు తిరిగి జీవం పోసేందుకు ప్రయత్నించాను. సెమీ-న్యూడ్ ఉమెన్‌ను ఇది వర్ణిస్తుంది. ఈ ఆర్ట్ వర్క్‌కు ఉత్తమ ప్రశంసలు దక్కాయి.

ఇలా ప్రఖ్యాత కళాకారుల ఫేమస్ పెయింటింగ్స్ రెప్లికాలు చిత్రీంచగా డిసెంబరులో న్యూయార్క్‌లో జరిగే వర్చువల్ ఎగ్జిబిషన్‌కు తొమ్మిది ఆర్ట్ వర్స్క్ ఎంపికయ్యాయి. ఉపయోగపడని నోట్ల విలువను పునరుద్ధరిస్తూ భవిష్యత్తులో వెనిజులా నోట్లకు ప్రాచుర్యం తీసుకురావాలనుకుంటున్నా. ఇతర దేశాల బ్యాంకు నోట్లను కూడా పెయింట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.

ఇన్‌స్టాకు బానిసయ్యారా.. అయితే మీ కోసమే ఈ ఫీచర్!

Advertisement

Next Story