దేశంలోనే అద్వితీయమైన పుణ్యక్షేత్రం యాదాద్రి

by Shyam |
దేశంలోనే అద్వితీయమైన పుణ్యక్షేత్రం యాదాద్రి
X

దిశ, నల్గొండ: దేశంలోనే యాదాద్రి అద్వితీయమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రధానాలయం, ప్రెసిడెంట్ సూట్ నిర్మాణ పనులను మంత్రి పర్యవేక్షించారు. ఆలయ ఫ్లోరింగ్, ప్రాకారాలు, మండపాలు, బాహ్య ప్రాకారాలు, శివాలయం తదితర నిర్మాణ పనులన్నీ పరిశీలించారు. మంత్రి వెంట ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్​రావు, ఆర్ అండ్ బీ అధికారులు ఉన్నారు.

Tags: vemula prashanth reddy, visit, yadhagiri gutta

Advertisement

Next Story