- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘుమఘుమలాడే వెజ్ పులావ్ రెసిపీ
ఎంతో సులువైన, పౌష్టికమైన వెజ్ పులావ్‌ను సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. వెజిటెబుల్ పులావ్‌ను కొన్ని నిమిషాలలో ప్రిపేర్ చేయవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు:
బాస్మతి బియ్యం -2 కప్పులు
నీళ్లు -4 కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్ట్ -2 టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి -4
ఉల్లిపాయ -1
నూనె -3 టేబుల్ స్పూన్స్
నెయ్యి -2 టేబుల్ స్పూన్స్
బీన్స్ ముక్కలు -పావు కప్పు
క్యారెట్ ముక్కలు -పావు కప్పు
బంగాళదుంప ముక్కలు -పావు కప్పు
నానబెట్టిన బఠానీలు -పావు కప్పు
కొత్తిమీర, పుదీనా తరుగు – కొద్దిగా
ఉప్పు -తగినంత
బిర్యానీ దినుసులు:
బిర్యానీ ఆకులు -4
లవంగాలు -6
దాల్చిన చెక్క -1 అంగుళం ముక్క
మిరియాలు -1 స్పూన్
షాజీరా -అర టీస్పూన్
యాలకులు -4
మరాఠీ మొగ్గ -2
అనాస పువ్వు -2
జాపత్రి -2
తయారీ విధానం:
ముందుగా బియ్యం కడిగి గంట సేపు నానబెట్టాలి. ప్రెజర్ కుక్కర్‌లో నూనె, నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కూరగాయల ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకుని బాగా కలుపుకోవాలి. సన్నని మంటపై ఐదు నిమిషాల పాటు కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని వడకట్టుకుని మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. మీడియం ప్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని, ప్రెజర్ పోయాక ఒక బౌల్‌లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి వెజ్ పులావ్ రెడీ..