ధ్యాన్‌చంద్ బయోపిక్‌పై బీటౌన్ అప్‌డేట్

by Shyam |
ధ్యాన్‌చంద్ బయోపిక్‌పై బీటౌన్ అప్‌డేట్
X

దిశ, సినిమా : ఇండస్ట్రీలో దశాబ్ధంగా బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో లెజెండరీ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ బయోపిక్ చాలా సార్లు హెడ్ లైన్స్ టచ్ చేసింది. ముందుగా కరణ్‌ జోహార్ ఈ రైట్స్ బ్యాగ్ చేసుకోగా షారుఖ్ ఖాన్ ధ్యాన్‌‌ చంద్ పాత్రలో కనిపిస్తారని అనుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే కావడంతో ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. ఆ తర్వాత సినిమా మేకింగ్ రైట్స్ ఆర్ఎస్వీపీ కొనుగోలు చేయగా.. భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం జరుగుతున్నట్లు బీటౌన్ టాక్.

అభిషేక్ చౌబే డైరెక్ట్ చేయనున్న మూవీకి సుప్రతీక్ సేన్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. ధ్యాన్ చంద్ క్యారెక్టర్ కోసం వరుణ్‌ ధావన్‌ను అప్రోచ్ అయ్యారట మేకర్స్. స్క్రిప్ట్ అమేజింగ్‌‌గా డెవలప్ చేయడంతో ఇంప్రెస్ అయినా.. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్‌లకు డేట్స్ ఇవ్వాల్సి ఉన్నందునా వరుణ్ తిరస్కరించాడట. హాకీ ప్రిపరేషన్, షూటింగ్‌కు ఎక్కువ రోజులు కేటాయించాల్సి వస్తున్నందున ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా వరుణ్ ‘జగ్ జగ్ జీయో’, ‘భేడియా’, ‘సంకి’, ‘ఎక్కీస్’ మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది.

Advertisement

Next Story