- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా? : వరు
తమిళనాడులో ఏడేళ్ల బాలిక జనప్రియ అత్యాచారం, హత్య ఘటనపై తీవ్రంగా స్పందించారు హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్. ‘మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం’ అని ప్రశ్నించారు. మరో చిన్నారి క్రూరంగా హత్యాచారం చేయబడిందని.. ఇలాంటి సొసైటీలో జీవించే బదులు కరోనాతో మనమంతా చావాల్సిందని అభిప్రాయపడ్డారు.
https://www.instagram.com/p/CCK0hOFAIVs/?igshid=b5uqqh4rscq6
ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రికి సోషల్ మీడియా వేదికగా ఓ రిక్వెస్ట్ చేశారు. ఆడపిల్లలు, మహిళల తరపున సీఎంను అభ్యర్థిస్తున్నట్లు తెలిపిన వరు.. ఇలాంటి రేప్ కేసు జరిగితే వెంటనే డెత్ పెనాల్టీ జరిగేలా ఆర్డర్ పాస్ చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి అమ్మాయిల వైపు చూసేందుకు భయపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధమైన న్యాయం చేస్తున్న తొలి రాష్ట్రంగా తమిళనాడు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. లేదంటే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.