- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోరూరించే రొయ్యల ఇగురు ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేయండి!
దిశ, వెబ్‌డెస్క్: చికెన్, మటన్, చేపలు ఎలా ఇష్టపడుతారో రొయ్యలను కూడా ఇష్టంగా తినేవారు చాలామంది ఉంటారు. రొయ్యలు ఎంతో టెస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల ఇగురు ఒకటి. రొయ్యల ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మంది దీనిని ఇష్టంగా లాగిస్తుంటారు. ఎటువంటి ఘాటైన మసాలాలు లేకుండా చాలా రుచిగా రొయ్యల ఇగురును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు- 2, యాలకులు – 2, ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు, కారం – ఒకటిన్నర టీ స్పూన్, శుభ్రం చేసిన రొయ్యలు – అరకిలో, నీళ్లు – పావు కప్పు, సరిపడ కొత్తిమీర, గరం మసాలా – పావు టీ స్పూన్.
మసాలా పేస్ట్‌కు కావల్సిన పదార్థాలు:
వెల్లుల్లి రెబ్బలు – 8, ధనియాలు – అర టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, టమాటాలు – పెద్దవి రెండు, మిరియాలు – ఒక టీ స్పూన్, కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్స్.
రొయ్యల ఇగురు తయారీ విధానం:
ఫస్ట్ జార్ లో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర, టమాట ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. అనంతరం మట్టి గిన్నెలో నూనె వేసి చేసి.. మసాలా దినుసులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు ఆయిల్ లో వేయించి, పచ్చిమిర్చి, కరివేపాకు, దంచుకున్న మిరియాలు వేసి వేయించాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న టమాట పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి మిక్స్ చేయాలి. దీనిని బాగా వేయించాక ఈ మిశ్రమంలో రొయ్యలు వేసి కలపాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాల ఉంచి, నీళ్లు పోసి కలపాలి. రొయ్యలు మెత్తగా ఉడికి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివర్లో గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు అలా ఉంచాలి. ఎంతో రుచిగా ఉండే రొయ్యల ఇగురు తయారు అయిపోయింది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.