- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాక్సిన్లు కావలెను.. కొత్త స్టాక్ కోసం ఎదురుచూపులు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టీకాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. రోజుకు సగటున రెండు లక్షల వరకు టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు, సిబ్బంది సిద్ధంగా ఉన్నా తగినంత నిల్వలు లేకపోవడంతో పొదుపుగా వాడుతోంది ప్రజారోగ్య శాఖ. శనివారం దాదాపు రెండు లక్షల టీకాలను ఇవ్వగా ఆదివారం మాత్రం కేవలం 59 వేలతోనే సరిపెట్టింది. మే నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్ళు నిండినవారందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అని ముఖ్యమంత్రి ప్రకటించారుగానీ ఎన్ని డోసుల వస్తుందనేదానిపై మాత్రం స్పష్టత కరువైంది. కేవలం తగనంత నిల్వ లేని కారణంగా ప్రతీరోజూ ఇస్తున్నదాంట్లో నాల్గో వంతుతోనే ఆపేయాల్సి వచ్చింది.
ఇప్పటివరకు రాష్ట్రానికి 41.75 లక్షల డోసులురాగా అందులో శనివారం నాటికే 40.83 లక్షల డోసుల్ని వాడేసింది. ఆదివారం మరో 59 వేల డోసుల్ని వినియోగించింది. ఆదివారం ఉదయానికి మరో 1.60 లక్షల డోసులు వచ్చాయి. చివరకు రాష్ట్రం దగ్గర దాదాపు రెండు లక్షల మేర డోసులు ఉన్నాయి. ఇవి ఒక్క రోజుకే సరిపోతాయని, మళ్ళీ ఎన్ని డోసులు వస్తుందో తమకు సమాచారం లేదని వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. అదనంగా కేంద్రం నుంచి వ్యాక్సిన్ వస్తేనే మంగళవారం ఈ ప్రక్రియ ముందుకు సాగుతుందని లేదంటే కష్టమేనని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి వచ్చిన డోసులు : 43,35,600
ఫస్ట్ డోస్‌గా ఇచ్చినవి : 35,58,130
సెకండ్ డోస్‌గా ఇచ్చినవి : 5,12,240
ఆర్మీకి ఇచ్చినవి : 62,970
బఫర్ రిజర్వుగా కేంద్రాల్లో ఉన్నవి : 29,060
రాష్ట్రం దగ్గర ఉన్నవి : 1,73,200
ఇందులో కొన్ని వృథా అయ్యాయి.