Free vaccine for journalists: రేపు, ఎల్లుండి జర్నలిస్టులకు ఫ్రీ వ్యాక్సిన్

by Shyam |   ( Updated:2021-05-27 01:00:23.0  )
Free vaccine for journalists: రేపు, ఎల్లుండి జర్నలిస్టులకు ఫ్రీ వ్యాక్సిన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరికి ఈ నెల 28, 29వ తేదీల్లో వ్యాక్సిన్ ఇస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు. సూపర్ స్పైడర్స్ జాబితాలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. సమాచార పౌర సంబంధాల శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును వ్యాక్సిన్ కేంద్రాల వద్ద సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆయా జిల్లా డీపీఆర్ఓల వద్ద కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల జాబితా అందుబాటులో ఉందన్నారు.

రాష్ట్రంలో 20 వేల మంది అక్రిడేషన్ జర్నలిస్టులు పనిచేస్తుండగా.. వీరిలో 3,700 మంది రాష్ట్ర స్థాయి జర్నలిస్టులు ఉన్నారన్నారు. రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల కోసం హైదరాబాద్‌లోని సోమాజీగూ ప్రెస్ క్లబ్, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, యం.సి.ఆర్.హెచ్.ఆర్.డి ఇన్‌స్టిట్యూట్ జూబ్లీ హిల్స్, చార్మినార్ యునాని హాస్పిటల్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Advertisement

Next Story