- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొలువులిచ్చే సంస్థలోనే పోస్టుల్లేవ్.. ఏండ్లుగా ఖాళీలు
దిశ, తెలంగాణ బ్యూరో : కొలువులు భర్తీ చేసే టీఎస్పీఎస్సీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏండ్ల నుంచి ఈ పోస్టులను భర్తీ చేయకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీలో పాలకవర్గం లేదు. కేవలం ఒక్క సభ్యుడే సాయిలు ఉండగా.. ఆయన్ను ఇంఛార్జీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. పాలకవర్గం గడువు తీరిపోయినా నియామక ప్రక్రియను చేపట్టడం లేదు. అయితే ఇందులో పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు.
165లో 90 మందే
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీపీఎస్సీ నుంచి టీఎస్పీఎస్సీకి 128 మంది ఉద్యోగులు అలాట్ చేయగా.. చాలా పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు. ఆ తర్వాత కిందిస్థాయిలో కేడర్ స్ట్రెంత్‌ను భర్తీ చేయడం లేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్ల విభాగాల్లో పోస్టులన్నీ దాదాపుగా ఖాళీ ఉన్నాయి. ప్రస్తుత వివరాల ప్రకారం 165 మంది కేడర్ స్ట్రెంత్ ఉండాల్సి ఉండగా… రెగ్యులర్ ఉద్యోగులు 82 మంది, మరో 8 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందితో కలుపుకుని 90 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఇప్పటి వరకు ప్రక్రియను కూడా మొదలుపెట్టడం లేదు. దీంతో పనిభారం పెరుగుతుందంటున్నారు.
150 మందిని ఇవ్వండి
టీఎస్పీఎస్సీ తొలినాళ్లలో టీఎస్పీఎస్సీకి ఉద్యోగులు ఎంతమంది కావాలంటూ ప్రభుత్వం నివేదిక అడిగింది. కమిషన్ కార్యాకలాపాలు సాగించేందుకు అదనంగా 150 మంది సిబ్బంది కావాలంటూ నివేదిక ఇచ్చారు. ఏ విభాగంలో ఎంతమంది కావాలనే అంశాలను వివరించారు. కానీ ప్రభుత్వం నుంచి రిప్లై రాలేదు. అయితే ఫైళ్లు పెండింగ్‌లో ఉండటంతో పాటు పలు కారణాలతో టీఎస్పీఎస్సీ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు పంపింది. 150 మందిలో కనీసం 75 మందిని నియమించాలని కోరింది. కానీ ప్రభుత్వం దీన్ని కూడా పక్కనేసింది.
ముగ్గురు జాయింట్ సెక్రెటరీలు ఏమైంది..?
పబ్లిక్ సర్వీస్కమిషన్లో ప్రస్తుతం సెక్రెటరీ వాణీప్రసాద్ఉండగా.. ఉన్నతస్థాయిలో ఇద్దరు అడిషనల్ సెక్రెటరీలు, ఐదుగురు డిప్యూటీ సెక్రెటరీలు, 10 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు ఉన్నారు. అయితే ఉద్యోగాల భర్తీ చేసే కమిషన్ కావడంతో.. పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, దీనికోసం ముగ్గురు జాయింట్సెక్రెటరీలు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ముందుగా ప్రభుత్వం కూడా ఒకే చెప్పింది. ముగ్గురు జాయింట్సెక్రెటరీలు అవసరమని, దానికి ఆమోదం కూడా తెలిపింది. కానీ నియామకంలో మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు. కొలువుల భర్తీ ప్రక్రియలో వేగం పెంచాలంటే కచ్చితంగా ముగ్గురు జాయింట్ సెక్రెటరీలు అవసరమని, ప్రస్తుతం భారీగా కొలువులు భర్తీ చేయాల్సిందిగా సీఎం ప్రకటించిన నేపథ్యంలో వీటిని ముందుగా భర్తీ చేయాలని విన్నవిస్తూనే ఉన్నారు. కానీ ఈ ఫైల్‌ను ప్రభుత్వం పక్కనేసింది. ముగ్గురు జాయింట్సెక్రెటరీల భర్తీ అడుగు ముందుకు పడటం లేదు.