- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఉప ఎన్నికలు వస్తే తప్ప కేసీఆర్‌కు నిరుద్యోగులు గుర్తురారా ?’
దిశ, గోదావరిఖని : ఉద్యోగాల నియామాకల విషయంలో అలసత్వం వహిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్దన్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రాన్ని సాధించుకుంటే, నేడు కుటుంబ గడీల పాలన కొనసాగుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ తెలంగాణగా మారిందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చే సరికే నిరుద్యోగులు గుర్తుకు వస్తారని పేర్కొన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని నమ్మించిన కేసీఆర్, మరల హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా హంగు ఆర్భాటాలు అబద్ధాలతో మళ్లీ నిరుద్యోగుల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. కమలనాథ్ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని వారు ప్రశ్నించారు. కాలే కడుపులకు కంప్యూటర్లే తిండి పెడతాయని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర మంత్రులు అవహేళనగా మాట్లాడడం అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఊసే లేదని కనీసం దాని పై విశ్లేషణ సమీక్ష సమావేశం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుంటే అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవని గౌతమ్ గోవర్ధన్ హెచ్చరించారు.