- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం లేఖ రాశారు. లాక్‌డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు చిన్న పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. అధిక మొత్తంలో వచ్చిన బిల్లులపై టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని అన్నారు. పెరిగిన బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారన్నారు. లాక్‌డౌన్ కాలంలో ప్రజల ఆదాయం పడిపోయినందున ఎక్కువ చార్జీలు వేయడం సరికాదని, వాటిని మాఫీ చేయాలని లేఖలో ప్రస్తావించారు.
Next Story