మొటిమలు.. ఇలా మటుమాయం!

by Sujitha Rachapalli |   ( Updated:2020-04-16 04:21:47.0  )
మొటిమలు.. ఇలా మటుమాయం!
X

దిశ, వెబ్ డెస్క్: పలు ముఖ సమస్యలతో మీరు నిత్యం అంతర్మథనం చెందుతున్నారా? అయితే ఈ చిట్కాను అనుసరించండి. దాని ద్వారా వచ్చే సత్ఫలితాలతో ఖచ్చితంగా ఆనందపడతారు. అంతేకాదు.. ఇంకెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అదెలాగంటే…

చాలామంది ముఖతేజస్సు లేక, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఉండండతో కాస్త అంద హీనంగా కనిపిస్తుంటారు. దీంతో ఎవరికి వారే ఎంతగానో కుమిలిపోతుంటారు. అయితే.. ఈ సమస్యలను పరిష్కరించేందుకు పుదీనా ఆకు ఎంతగానో దోహదం చేస్తది. అదెలాగంటే.. కొన్ని పుదీనా ఆకులతో కొంత పేస్ట్ ను తయారు చేయాలి. ఆ పేస్ట్ లో కోడిగుడ్డులోని సొనను కలపాలి. ఆ తర్వాత దానిని మీ ముఖానికి అప్లై చేసుకోవాలి. అలాగే కాసేపు ఉండాలి. అది పూర్తిగా ఆరినంక కడగాలి. ఇలా ప్రతిరోజూ చేయాలి. ఇలా చేస్తే మీ ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, ఇతర సమస్యలు మటుమాయమైతాయి.

అదేవిధంగా కొన్ని పుదీనా ఆకులను తీసుకుని పేస్ట్ గా తయారు చేయాలి. దానిలో కొంచెం పసుపు కలపాలి. ఆ తర్వాత దానిని మీ ముఖానికి అప్లై చేసుకోవాలి. దాని కంటే ముందు గోరువెచ్చని నీళ్లతో మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ పేస్ట్ మీ ముఖానికి అప్లై చేసినంక సుమారు 30 నిమిషాలపాటు అలాగే ఉంచి, ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. దీంతో మీ ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతది. అంతేకాదు.. ముడతలు రాకుండా చేస్తది. మీలో వృద్ధాప్య ఛాయలు రాకుండా దోహదపడుతది.

మరికొన్ని సమస్యలకు కూడా ఈ పుదీనా ఆకు ఎంతగానో ఉపయోగపడుతది. అదెలాగు అంటే కొన్ని పుదీనా ఆకులను తీసుకుని రసంగా తయారు చేయాలి. దానిలో కొంచెం పొప్పడి రసం కలపాలి. ఆ మిశ్రమాన్ని మీకు చర్మ వ్యాధులు ఉన్న చోట రాసుకుంటే ఆ వ్యాధులు అలా మటుమాయమైతాయి.

Tags: mint leaf, skin problems, uses, juice, turmeric

Advertisement

Next Story

Most Viewed