స్టార్‌డమ్ లేకున్నా.. రికార్డు సృష్టించిన వైష్ణవ్ తేజ్

by Shyam |   ( Updated:2023-05-19 11:15:55.0  )
Vaishnav Tej, Krithi Shetty
X

దిశ, సినిమా: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన.. తెలుగు ఇండస్ట్రీకి ఫ్రెష్ పెయిర్‌ను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. డెబ్యూ హీరో, హీరోయిన్లు తమ సినిమా ద్వారా ఇంత గొప్ప కలెక్షన్స్ వసూలు చేయడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారి కాగా.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌లోనూ ‘ఉప్పెన’ ఇలాంటి రికార్డే క్రియేట్ చేసింంది. 18.5 టీఆర్‌పీ రేటింగ్‌తో, ఒక డెబ్యూ హీరో కెరియర్‌లోనే హైయెస్ట్ టీఆర్‌పీ రేట్ నమోదు చేసిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతానికి ‘ఉప్పెన’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమ్ అవుతుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ద్వారా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. కాగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించారు.

Advertisement

Next Story