- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మసీదు శంకుస్థాపనకు వెళ్లను: యోగి ఆదిత్యానాథ్

లక్నో: అయోధ్యలో మసీదు శంకుస్థాపనకు ఆహ్వానించినా వెళ్లబోరని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. కాబట్టి తనను ఆహ్వానించకపోవడమే మంచిదని తెలిపారు.
‘ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించడాన్ని తప్పుపట్టబోను. అయితే, యోగిగా తనను ఆహ్వానిస్తే మాత్రం కచ్చితంగా వెళ్లను. నేను హిందువును కాబట్టి మసీదు శంకుస్థాపనకు హాజరుకాను. నేను అనుసరిస్తున్న మతం నిబంధనలకు అనుగుణంగా జీవించే హక్కు నాకున్నది. కాబట్టి నన్ను ఎవ్వరైనా ఆహ్వానించకపోవడమే మంచిది. నన్ను ఆహ్వానిస్తే మాత్రం చాలా మంది సెక్యులరిజం ప్రమాదంలో పడుతుంది. కేవలం నెత్తిపై టోపీ పెట్టుకుని సెక్యులరిస్టు డ్రామాలు వేసినప్పటికీ ప్రజలకు వాస్తవం తెలుసు’ అని సెలవిచ్చారు.
కాగా, తాను కేవలం హిందువులకే కాదు, రాష్ట్రమంతటికీ సీఎం అని, ఆయన భాష హుందాగా లేదని సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి పవన్ పాండే విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు యోగి ఆదిత్యానాథ్ ప్రజల నుంచి క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.