మా నాన్న అంత్యక్రియలకు హాజరవ్వలేను : యూపీ సీఎం

by vinod kumar |
మా నాన్న అంత్యక్రియలకు హాజరవ్వలేను : యూపీ సీఎం
X

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ లాక్‌డౌన్ నేపథ్యంలో తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకావడం లేదు. తండ్రి అంత్యక్రియల కన్నా.. 23 కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తే తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. తన తండ్రి అంత్యక్రియలకు తల్లి, బంధువులు వెళ్లుతున్నారనీ, అక్కడ కూడా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని కోరినట్టు వివరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్.. కిడ్నీ సమస్యలతో గతనెల ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. కాగా, పరిస్థితులు విషమించి ఈ రోజు కన్నుమూశారు. ‘నాన్న తుది శ్వాస విడిచిన వార్త అందగానే.. హతాశయుడినయ్యాను. కానీ, ఆయన చెప్పిన విషయాలు నాకు గుర్తొచ్చాయి. స్వప్రయోజనాలు వదిలి, కఠోరంగా శ్రమించాలని, విశ్వాసపాత్రులుగా ఉండాలని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన అంతిమ సంస్కారాల్లో ఉండాలనే నాకు అనిపించింది. కానీ, 23 కోట్ల యూపీ ప్రజల రక్షణ బాధ్యత తీసుకున్న నేను.. ఆయన అంత్యక్రియలకు వెళ్లలేకపోతున్నాను. కానీ, లాక్‌డౌన్ కారణంగా రేపు జరిగే అంతిమ సంస్కారాలకు హాజరవ్వలేకపోతున్నాను. మా అమ్మ, ఇతర బంధువులనూ అంత్యక్రియల్లో తప్పకుండా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని కోరాను. లాక్‌డౌన్ అయిపోయాక.. నేను వెళతాను’ అని సీఎం యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. కొవిడ్ 19పై అధికారులతో సమావేశంలో ఉన్నప్పుడు ఈ విషయం యోగికి తెలిసింది. అయినా.. ఆ సమావేశాన్ని అలాగే కొనసాగించినట్టు అందులో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు. కాగా, యోగి తండ్రి మరణానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత ప్రియాకం గాంధీ, కమల్ నాథ్ సంతాపం ప్రకటించారు.

tags: UP, CM Yogi, father, funeral, attend, lockdown, aiims, death

Advertisement

Next Story

Most Viewed