- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి
దిశ, తెలంగాణ బ్యూరో : అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వర్కింగ్ పీపుల్స్ చార్టర్ జాతీయ కోఆర్డినేటర్ చందన్ కుమార్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ లో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి వర్కింగ్ పీపుల్స్ చార్టర్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. అసంఘటిత కార్మికులను కార్మికశాఖ గుర్తించడంతో పాటు వారికి బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా చందన్ కుమార్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేసే చాలా మంది కార్మికులు, అధికారిక రంగంలో అనధికారికంగా పనిచేస్తున్న వారిని కూడా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. వారికి సహాయం అందజేసేందుకే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూపీసీ జాతీయ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ షేక్ సల్లావుద్దీన్, ఇండియా లేబర్‌లైన్ స్టేట్ కోఆర్డినేటర్ అంజిరెడ్డి, గృహకార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ సిస్టర్ జెనస్టస్, మోంట్‌ఫోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు ఉన్నారు.