- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూనియన్ బ్యాంక్ నికర లాభం రూ. 341 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank Of India) 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 340.95 కోట్లుగా ఉంది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ. 230.12 కోట్లుగా నమోదు చేసింది.
నికర వడ్డీ ఆదాయంలో గణనీయమైన మెరుగుదల నమోదైందని బ్యాంక్ ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ తెలిపారు. నికర వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి రూ. 6,403 కోట్లుగా నమోదైనట్టు బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 20,487.01 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 10,053.68 కోట్లుగా నమోదైనట్టు పేర్కొంది.
అలాగే, ప్రస్తుత ఏడాది జూన్ 30 నాటికి బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(NPA) 14.95 శాతానికి తగ్గాయని, గతేడాది ఇదే సమయానికి స్థూల ఎన్‌పీఏలు 15.18 శాతంగా ఉన్నట్టు తెలిపింది. నికర ఎన్‌పీఏలు 7.23 శాతం నుంచి 4.97 శాతానికి తగ్గాయని పేర్కొంది. ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ 1న ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను యూనియన్ బ్యాంకులో విలీనం చేసిన సంగతి తెలిసిందే.