హిస్టరీ రిపీట్.. ఈటల పొలిటికల్ కెరీర్‌లో అనూహ్య పరిణామం

by Anukaran |
Eatala Rajende And Kcr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి వరసగా ఆరు సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఈటల రాజేందర్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మొదట కమలాపూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఈటల డిలిమిటేషన్ కారణంగా ఆ తర్వాత హుజురాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. ఈ రెండు నియోజకవర్గాల నుండి గెలిచిన రాజేందర్ ఎమ్మెల్యే పదవి కాలం పూర్తయ్యేవరకూ ఐదేళ్ల పాటు కంటిన్యూగా ఎమ్మెల్యేగా కొనసాగలేదు. తొలిసారిగా 2004 సాధారణ ఎన్నికల్లో కమలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తెలంగాణ ఉద్యమం కోసం ఈటల 2008 లో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. తిరిగి 2009 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించినప్పటికీ, 2010లో మ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాజీనామా చేసి బై ఎలక్షన్ లో గెలిచారు.

2014 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి గెలిచిన రాజేందర్ 2018 లో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఐదేళ్ల కాలం పూర్తి కాక ముందే ఎమ్మెల్యే బాధ్యతలను వదులుకుని బరిలో నిలవాల్సి వచ్చింది. అప్పటి ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఈటెల రెండున్నరేళ్ళకే పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అసైన్డ్ భూముల కొనుగోలుకు సంబందించిన ఆరోపణలు రావడంతో కేసీఆర్ కేబినెట్ నుండి బర్తరఫ్‌కు గురయ్యారు. దీంతో ఆత్మగౌరవ నినాదానికి పిలుపునిచ్చిన ఈటల శనివారం ఎమ్మెల్యే పదవికి మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చింది. 17 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఈటల ఈ సారి కూడా పూర్తి పదవి కాలం అనుభవించకుండానే పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed