- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచేతుడునైనా ఆదుకోండి..
దిశ, వెబ్‌డెస్క్ : ఆ యువకుడిని విధి వంచించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి.. వారి ప్రేమకు దూరమయ్యాడు. అమ్మమ్మ చేరదీసినా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. ఊహ తెలిసినప్పటి నుంచే రెక్కల కష్టంతో బతుకునెళ్లదీస్తున్న అతడి జీవితాన్ని మరోమారు చీకట్లు కమ్మేశాయి. ఉపాధి కోసం పొట్టచేతపట్టుకోని వెళ్లిన అతడిని అదే ఉపాధి అచేతనుడిని చేసి మంచంపై పడేసింది. కన్నీరే చెమ్మ గిల్లిలా ఉన్న ఆ యువకుడిపై ప్రత్యేక కథనం..
మందుల గణేష్‌ది మహబూబాబాద్ జిల్లా, దంతలపల్లి మండలం, కుమ్మరికుంట్ల గ్రామం. గణేష్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలోనే మరణించారు. అప్పటి నుంచి గణేష్ అమ్మమ్మ తాత దగ్గరే పెరిగాడు. వారిదీ నిరుపేద కుటుంబమే. రోజు కాయకష్టం చేస్తేనే వారి కడుపు నిండేది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం గణేశ్ బతుకుదెరువు కోసం సిద్దిపేటకు వెళ్లాడు. అక్కడ రోడ్డు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు డాంబర్ కాళ్ల మీద పడి కాలిపోయాయి. ఈ ప్రమాదంలో గణేష్ రెండు కాళ్లు కోల్పోయాడు. అయినా కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. ప్రథమ చికిత్సకు కూడా పైసా ఇవ్వలేదు.
రెండు కాళ్లు పూర్తిగా కాలిపోవడంతో అమ్మమ్మే అప్పులు చేసి వైద్యం చేయించింది. అయినా కాళ్లు పనిచేయడం లేదు. కనీసం నిలబడే పరిస్థితి కూడా లేదు. అసలే పేద కుటుంబం కావడంతో గణేష్ పోషణ వారికి కష్టంగా మారింది. నెలనెలా మందుల కోసం వారికి వచ్చే పింఛనే ఆధారమైంది. రెక్కాడితేనే డొక్కాడని కుటుంబం కావడంతో వైద్యం చేయించడం కష్టమవుతుందని, మానవత దృక్ఫధంతో దాతలు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
వారి పరిస్థితిని గమనించిన స్థానిక యువత తుంగతుర్తి మండలం కొత్తగూడెంకు చెందిన హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ కి సమాచారం అందించారు. ఫౌండేషన్ వారు వెంటనే స్పందించి అత్యవసర సాయం కింద కుటుంబానికి 50 కేజీల బియ్యం, నెలకు సరిపడు సరుకులు, కూరగాయలు అందజేశారు. దాతలు తమ శక్తి మేరకు సాయం చేసి గణేష్ ను ఆదుకోవాలని హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ కోరింది. దాతలు 96527 87231 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి రాజేష్, సభ్యులు సురేష్, నరేష్, కృష్ణ, వెంకన్న, వెంకటేష్, మధు, యువసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు.