- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తల్లి శవం చూసి ప్రాణాలొదిలిన కొడుకు

X
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి మృతదేహాన్ని చూసి కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచి పెట్టడంతో ఆ గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది.
గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు బేత అచ్చమ్మ ఆదివారం ఉదయం చనిపోయింది. ఆ సమయంలో కుమారుడు ఇంట్లో లేడు. తల్లి చనిపోయిన సమాచారం తెలుసుకున్న దేవుడు ఆగమేఘాలమీద వచ్చి తల్లి మృతదేహాన్ని చూసి విలపిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
దీంతో బాధిత కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. వారి రోదన చూసిన గ్రామస్తులంతా కంటతడి పెడుతున్నారు. మరణించిన దేవుడు వయస్సు 50 సంవత్సరాలు కాగా, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story