- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టాస్ పడకుండానే తొలి సెషన్ రద్దు
by Shyam |

X
దిశ, స్పోర్ట్స్: లాక్‌డౌన్ అనంతరం ఇంగ్లండ్, విండీస్ జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక తొలి టెస్టు టాస్ కూడా పడకుండానే తొలి సెషన్ రద్దయింది. సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం పడుతూనే ఉంది. మధ్యలో వర్షం తగ్గినా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో గ్రౌండ్స్‌మెన్ ఆరబెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఇంతలోనే మరోసారి భారీ వర్షం పడింది. అప్పటికే లంచ్ టైం కావవడంతో అంపైర్లు టాస్ కూడా వేయకుండా తొలి సెషన్ రద్దయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం సౌతాంప్టన్ పూర్తిగా మేఘావృతమై ఉంది. తొలి రోజు మ్యాచ్ జరగాలంటే వర్షం ఆగిన తర్వాత మరో గంట సమయం పడుతుంది. మరి రెండో సెషన్ అయినా జరుగుతుందో లేదో తెలియడం లేదు.
Next Story