- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రీసెర్చ్: కొత్త కరోనా వైరస్ చాలా డేంజర్
దిశ,వెబ్ డెస్క్ : ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తున్నకొత్త కరోనా వైరస్ గురించి ఆందోళనకరమైన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. వచ్చే ఏడాది కొత్త కరోనా వైరస్ వల్ల భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చ్ తెలిపింది.
ఈ రీసెర్చ్ ప్రకారం ఇతర వైరస్‌ల కంటే కొత్త కరోనా వైరస్ 56 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు తేలింది. అనారోగ్యానికి గురికావడం, ఆస్పత్రిపాలవ్వడం వల్ల ఎక్కువ మరణాల సంఖ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇది ఎక్కువ లేదా తక్కువ తీవ్రమైన వ్యాధికి దారితీస్తుందనడానికి స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి రాలేదని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ రీసెర్చ్ సైంటిస్ట్ బృందం వెల్లడించింది.
కొద్దిరోజుల క్రితం యూకే ప్రభుత్వం సైతం కరోనా వైరస్ ఇతర వైరస్‌ల కంటే 70శాతం అంటువ్యాధిలా వ్యాపిస్తుందని చెప్పింది. ఇది దాదాపు రెండుడజన్ల జన్యువుల్ని కలిగి ఉందని, ఇది కరోనా వైరస్ తయారుచేసిన ప్రోటీన్లను ప్రభావితం చేస్తుందని యూకే చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్యాట్రిక్ వాలెన్స్ వెల్లడించారు.