- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 వరల్డ్ కప్ బ్యాకప్ వెన్యూగా యూఏఈ?
దిశ, స్పోర్ట్స్: ఇండియాలో ప్రతీ రోజు రోజుకు లక్షల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన పురుషుల టీ20 వరల్డ్ కప్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వేదికను మార్చాల్సిన అవసరం ఉంటుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గత ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఇండియాలో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కూడా వాయిదా వేసే ఐసీసీకి భారీ నష్టం కలుగుతుంది.
దీంతో గతంలోనే ప్లాన్ బి తమ వద్ద ఉన్నదని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఐసీసీ అధికారుల సమాచారం మేరకు యూఏఈని బ్యాకప్ వెన్యూగా నిర్దారించినట్లు తెలుస్తున్నది. గత ఏడాది ఐపీఎల్‌ను విజయవంతగా నిర్వహించిన రికార్డు ఉండటంతో పాటు విదేశీ ప్రయాణాలకు హబ్‌గా ఉన్న అక్కడ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తన్నది. అయితే వరల్డ్ కప్‌కు ఇంకా 6 నెలల సమయం ఉండటంతో ఇప్పుడు దీనిపై చర్చించడం అనసవరమని.. కాకపోతే ఇండియాలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఐసీసీ చెబుతున్నది.