బాంబు తొక్కి… ఇద్దరికి గాయాలు

by Sridhar Babu |   ( Updated:2020-11-03 10:00:03.0  )
బాంబు తొక్కి… ఇద్దరికి గాయాలు
X

దిశ, భద్రాచలం: అడవిలో మావోయిస్టులు పాతిపెట్టిన బాంబులు తొక్కి ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయస్థితికి చేరుకున్నారు.బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని నైనాపాల్ అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు పాతిపెట్టిన ప్రెషర్ బాంబును ఇద్దరు వ్యక్తులు కాలినడకన వెళ్తూ తొక్కారు. దీంతో అవ్వి పేలి వారికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో రమేష్ హేమ్లా అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అడవిలో వెదురు సేకరణకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాలింపు చర్యలకు వచ్చే భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అడవుల్లో మందుపాతరలు, ప్రెషర్ బాంబులు పెట్టినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story