- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. అధికారిక ఉత్తర్వులే తరువాయి!

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సతక్క, సబ్ కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజనర్సింహతో పాటు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలిపారు. దీంతో బిల్లు తిరిగి ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సమావేశం అనంతరం ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం 11 గంటలకు మరోసారి కమిటీ భేటీ అవుతుందని తెలిపారు. రేపు ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఎస్సీ ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్-1 కింద ఒక శాతం, మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉప కులాలకు గ్రూప్-2 కింద 9 శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలను గ్రూప్-3 కింద 5 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది.