Amit Reddy: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుండు.. కేటీఆర్‌పై గుత్తా అమిత్‌రెడ్డి ఫైర్

by Shiva |   ( Updated:2025-04-13 07:43:13.0  )
Amit Reddy: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుండు.. కేటీఆర్‌పై గుత్తా అమిత్‌రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని కేటీఆర్ (KTR) పగటి కలలు కంటున్నాడని తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి (Gutta Amit Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల విషయంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రభుత్వంపై బురదజల్లే ఆలోచన చేస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం టీజీఐఐసీ (TGIIC) పరిధిలో ఉన్న భూములను పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు కేటాయిస్తే.. భవిష్యత్తులో ఆ భూములను లాక్కుంటామని కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆరోపించారు.

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ (Telangana Brand Image) అంటూ నిత్యం సోషల్ మీడియా (Social Media)లో ప్రచారం చేసుకునే కేటీఆర్ (KTR).. కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల విషయంలో నోటికొచ్చినట్లుగా ఆరోపణలు చేసి అదే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తూ చులకన అయ్యారంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ కక్షపూరిత ధోరణి, బీఆర్ఎస్ పార్టీ హెచ్‌సీయూ (HCU) విద్యార్థులను రెచ్చగొడుతున్న తీరును తెలంగాణ (Telangana) ప్రజలు కూడా గ్రహించాలని గుత్తా అమిత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed