- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిద్దిపేట నియోజకవర్గానికి రెండు జాతీయ పురస్కారాలు..
దిశ, సిద్దిపేట: అవార్డులు అయిన అభివృద్ధిలో ఆదర్శం అయిన పెట్టింది పేరు సిద్దిపేట నియోజకవర్గం. సిద్దిపేటకు మరో రెండు జాతీయ స్థాయి పురస్కారాలు వరించాయి. 2019 – 20 సంవత్సర గ్రామీణ దీన్ దయాల్ స్వశక్తి కరణ్ పురస్కారాలకు సిద్దిపేట నియోజకవర్గంలోని రెండు గ్రామాలు ఎంపిక అయ్యాయి. నారాయణరావుపేట మండలం మాల్యాల, సిద్దిపేట అర్భన్ మండలంలోని మిట్టపల్లి గ్రామాలు ఎంపిక అయినట్టు కేంద్ర పంచాయతీ మంత్రిత్వ శాఖ ప్రకటించారు. ఈ రెండు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ , చెత్త సేకరణ , పరిశుభ్రత ఇతర అంశాల పనితీరుకు, గ్రామ ప్రజల భాగస్వామ్యంపై జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఏప్రిల్ 24న కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ అవార్డ్లు గ్రామాల సర్పంచ్‌లు అందుకోనున్నారు.
– అభినందించిన మంత్రి హరీష్ రావు
గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనం అని, ఆదర్శ గ్రామాలుగా జాతీయ స్థాయిలో స్పూర్తి చాటిన రెండు గ్రామాల సర్పంచ్ లను , గ్రామ ప్రజలను అభినందించారు మంత్రి హరీష్ రావు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వించదగిన విషయం అన్నారు. ఇదే స్ఫూర్తితో గ్రామాలు ఆదర్శ గ్రామలుగా తీర్చిదిద్దేల కృషి చేయాలన్నారు.