- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరో ఇద్దరు దూబే అనుచరులు అరెస్ట్
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను పొట్టన బెట్టుకున్న రౌడీషీటర్ వికాస్ దూబే ముఠాకు చెందిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరంలో తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు శనివారం వారిని అరెస్ట్ చేశారు. వికాస్ దూబే ముఠాకు చెందిన ఓం ప్రకాష్ పాండే, అనిల్ పాండేలను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని యూపీ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నిన్న కాన్పూర్ సమీపంలో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం విధితమే.
Next Story