- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్
by Sumithra |

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.12 లక్షల నగదును, 3సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌పై సమాచారం వచ్చిన వెంటనే ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం ఆరా తీసిందని, ఈ వ్యవహారం నిర్వహిస్తున్న సురేష్ సింగ్, సబ్ ఆర్గనైజర్‌గా ఉన్న ముస్కు అజయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ చక్రవర్తి మీడియాకు వివరించారు. బెట్టింగ్ కోసం క్రికెట్ ఎక్స్‌ఛేంజ్, క్రికెట్ లైవ్ గురు మొబైల్ యాప్‌లను వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. ఆన్‌లైన్ ద్వారా ప్రతీబాల్‌కు స్కోర్లు చెప్తూ దానికి అనుగుణంగా బెట్టింగ్ మార్పులు చేర్పులు చేసుకుంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని వెల్లడించారు.
Next Story