దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌ కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో ఇద్ద‌రు ?

by Sumithra |
దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌ కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో ఇద్ద‌రు ?
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్‌/ ప‌ర‌కాల : నిరుద్యోగుల‌కు విద్యుత్ శాఖ‌లో ఉద్యోగాలిప్పిస్తామ‌ని మ‌ధ్యవ‌ర్తిగా ఉన్న కేశవ‌స్వామిని మోసం చేసిన ముగ్గురిలో ఇద్దరిని ప‌ర‌కాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స‌మాచారం. ఎన్పీడీసీఎల్ ప‌రిధిలోని స‌బ్ స్టేష‌న్లలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ల్లో ఉద్యోగాలిప్పిస్తామ‌ని చెప్పి ధ‌ర్మసాగ‌ర్ స‌బ్ స్టేష‌న్‌లో ఔట్ సోర్సింగ్ ప‌ద్ధతిలో ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తున్న పుల్లాబాబు, కాంట్రాక్టర్‌ వాలునాయాక్‌, గాడిపెల్లి వెంక‌టేశ్వర్లు తన‌ను మ‌ధ్యవ‌ర్తిగా ఉంచి నిరుద్యోగుల నుంచి ల‌క్షల రూపాయాలు వ‌సూలు చేసిన‌ట్లుగా కేశ‌వ‌స్వామి సూసైడ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. దీన్నే మ‌ర‌ణ వాంగ్ములంగా ప‌రిగ‌ణించాల‌ని సీపీ త‌రుణ్ జోషికి వేడుకున్నాడు. దంప‌తుల ఆత్మహ‌త్య కేసును వ‌రంగ‌ల్ పోలీసులు స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘ‌ట‌న త‌ర్వాత ప‌రారీలో ఉన్న ముగ్గురిలో ఇద్దరిని ప‌ర‌కాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముగ్గురిలో ఎవ‌రెవ‌రు పోలీసులు అదుపులో ఉన్నది అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story