బండ బూతులు తిట్టుకున్న బాలీవుడ్ సెలెబ్రిటీలు

by Anukaran |   ( Updated:2020-12-03 08:48:09.0  )
బండ బూతులు తిట్టుకున్న బాలీవుడ్ సెలెబ్రిటీలు
X

దిశ, వెబ్‌డెస్క్ :సెలెబ్రిటీలు మరీ దిగజారిపోతున్నారు. సొసైటీలో గుర్తింపు పొందిన హీరోయిన్ కంగనా రనౌత్, హీరో దిల్ జిత్ మధ్య లేటెస్ట్‌గా జరిగిన సోషల్ మీడియా వార్ బూతు పురాణంతో సాగింది. ఢిల్లీలో నార్త్ ఇండియన్ ఫార్మర్స్ వ్యవసాయ చట్టాలపై ప్రొటెస్ట్ చేస్తుండగా.. ఇందులో ఓ వృద్ధురాలిని టార్గెట్ చేసిన కంగన, షహీన్ బాగ్‌లో కనిపించిన తనే ఇప్పుడు రైతుగా ఆందోళన చేస్తుందని కామెంట్ చేసింది. టైమ్ మ్యాగజైన్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్‌గా కనిపించిన ఆమె రూ.100కు అందుబాటులో ఉంటుందని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత వెంటనే ట్వీట్ డిలీట్ చేసింది.

అయితే దీనిపై స్పందించిన హీరో దిల్ జిత్.. తను షహీన్ బాగ్‌లో ప్రొటెస్ట్ చేసిన వృద్ధురాలు కాదని, పంజాబ్‌‌కు చెందిన మహిందర్ కౌర్ అని ప్రూవ్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. వెంటనే తనకు కంగన టీమ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆఫ్ట్రాల్ దిల్‌జిత్ తనకే కౌంటర్ ఇస్తాడా అనుకున్న కంగన.. కరణ్ జోహార్ పెంపుడు కుక్కవైన నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదని, షహీన్ బాగ్‌లో ప్రొటెస్ట్ చేసిన ముసలమ్మ గురించే తను మాట్లాడానని.. మహీందర్ కౌర్ ఎవరో కూడా తనకు తెలియదని చెప్పింది. అనవసర డ్రామాలు ఆపడం మంచిదని వార్నింగ్ ఇచ్చింది.

కానీ దీనిపై రీకౌంటర్ ఇచ్చేందుకు వెనుకాడలేదు దిల్ జిత్. నేను కరణ్ పెంపుడు కుక్కనైతే.. నువ్వు ఎవరెవరితో పని చేశావో వాళ్లందరి పెంపుడు కుక్కవా? అని అడిగాడు. లెక్కపెడితే లిస్ట్ పెద్దది అయ్యేలా ఉందని మరింత ఘాటు కౌంటరే ఇచ్చేశాడు. అయినా మహీందర్ కౌర్ బాలీవుడ్‌కు చెందిన వ్యక్తి కాదు పంజాబ్‌కు చెందిన మహిళ అని.. మధ్యలో కరణ్ జోహార్‌ను తీసుకురావడం మంచిది కాదన్నాడు. ఈ మేరకు అబద్ధపు మాటలు చెప్తూ, మనుషుల ఎమోషన్స్‌తో ఆడుకోవడంలో కంగన సిద్ధహస్తురాలంటూ ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన కంగన.. దిల్ జిత్‌ను చెంచా అని సంభోదిస్తూ మరో ట్వీట్ చేసింది. నువ్వు ఎవరి దగ్గరైతో పని అడుక్కుంటావో, రోజూ వాళ్లందరి పని పడుతూనే ఉంటా.. ఎక్కువ డ్రామాలు చేయకు.. అబద్ధాలు ఆడేందుకు నేనేమీ నీలాంటి చెంచాను కాదు అంటూ కౌంటర్ ఇచ్చింది. కేవలం షహీన్ బాగ్ ప్రొటెస్టర్ గురించి మాత్రమే తను మాట్లాడానని, అలా కాకుండా నేను వేరేలా మాట్లాడానని ప్రూవ్ చేస్తే క్షమాపణ చెప్పేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది. ఢిల్లీలో అల్లర్లు సృష్టించిన వారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడేందుకు సిగ్గులేదా! అని దిల్‌జిత్‌పై బూతుల దాడి చేసిన కంగన.. అయినా కరణ్ జోహార్ లాంటి వాళ్లతో పనిచేసిన నీ దగ్గర అది ఆశించడం దండగే అంటూ వార్‌కు ఎండ్ పలికింది.

Advertisement

Next Story