- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ పోలీసులకు షాకిచ్చిన ట్విట్టర్
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పోలీసులకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఏపీ డీజీపీ పేరిట నకిలీ ట్విట్టర్ ఖాతా కేసుకు సంబంధించి వివరాలివ్వాలని విజయవాడ పోలీసులు పంపిన మెయిల్‌కు ట్విట్టర్ సమాధానం ఇవ్వలేదు. ఖాతాదారుల సమాచారాన్ని అందించలేమని నిరాకరించింది. అంతే కాదు తమకు ఖాతాదారుల వ్యక్తిగత భద్రత ముఖ్యంటోంది ట్విట్టర్. ఇప్పటికి మూడుసార్లు అధికారికంగా మెయిల్ పంపినప్పటికీ స్పందించడంలేదు. ఇకపోత గుర్తుతెలియని వ్యక్తులు డీజీపీ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేశారు.
ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ట్విట్టర్ ఆ ఖాతాను తొలగించింది. నకిలీ ట్విట్టర్ ఖాతాపై విజయవాడ సైబర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఏ ఐపీ అడ్రస్‌తో నకిలీ అకౌంట్‌ను సృష్టించారు? దీని వెనుక ఎవరున్నారు? ఏదైనా కుట్ర దాగుందా? అన్న కోణాల్లో విచారణ ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఐపీ అడ్రస్ కోసం పోలీసులు ట్విట్టర్‌ను మొయిల్ ద్వారా సంప్రదించారు. అయితే సమాచారం ఇవ్వడం కుదరదని, ఖాతాదారుల వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతుందని ట్విట్టర్ సమాధానం ఇచ్చింది. దీనిపై పోలీసులు మరో మెయిల్‌ను పంపినా స్పందన లేదు. దర్యాప్తులో భాగంగా లాగ్స్ కీలకమని, ఇవ్వకపోతే చట్టపరంగా ముందుకు వెలుతామని హెచ్చరించినా కనీసం స్పందించలేదు. దీంతో విజయవాడ పోలీసులు సమాచారాన్నిరాబట్టుకునేందుకు ట్విట్టర్ అధికారికి నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.