- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సరికొత్త 'జూపిటర్' స్కూటర్‌ను తెచ్చిన టీవీఎస్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ గురువారం తన సరికొత్త 125సీసీ స్కూటర్ జూపిటర్ మోడల్‌ను ఆవిష్కరించింది. భారత మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించే ప్రణాళికలో భాగంగా రూ. 73,400(ఎక్స్‌షోరూమ్) ధరతో కొత్త టీవీఎస్ జూపిటర్‌ను తెచ్చామని కంపెనీ వెల్లడించింది. ఇటీవల మారుతున్న ఆటోమొబైల్ పరిశ్రమలో మార్పులను అనుసరిస్తూ ఈ కొత్త స్కూటర్‌ను 125సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ఇండస్ట్రీ బెస్ట్ మైలేజ్, బెస్ట్-ఇన్ సెగ్మెంట్ యాక్సిలరేషన్ లాంటి అత్యాధునిక ఫీచర్లను ఇందులో అందించినట్టు కంపెనీ తెలిపింది.
అంతేకాకుండా గతం కంటే ఎక్కువ సీట్ స్టోరేజ్‌తో పాటు ఇతర స్కూటర్ల కంటే పొడవైన సీటును వినియోగదారుల కోసం అమర్చామని వివరించింది. ‘సంస్థ ప్రధానంగా నాలుగు విభాగాలను పరిగణలోకి తీసుకుని వాహనాలను తయారు చేస్తుంది. స్కూటరైజెషన్, ప్రీమియమైజేషన్, బ్రాండ్ కోసం పెట్టుబడులు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ లాంటి అంశాలపై ప్రధాన దృష్టి ఉంటుంది. 2013లో జూపిటర్ స్కూటర్ మొదటగా భారత మార్కెట్లోకి వచ్చింది. తక్కువ సమయంలో వినియోగదారుల నుంచి మెరుగైన స్పందనను ఈ మోడల్ దక్కించుకుందని’ టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కె ఎన్ రాధాకృష్ణన్ చెప్పారు.